Kidney Stones – Home Remedies
మూత్రాశయానికి సంబంధించిన వివిధ వ్యాధుల్లో కూడా కడుపునొప్పి ప్రముఖంగా వస్తుంది. మూత్రపిండాలలో రాళ్ళున్నప్పుడు , అవి కదిలి బయటకు రావటానికి చేసే ప్రయత్నం వలన విపరీతంగా కడుపునొప్పి వస్తుంది. రాయి బయటకు కొట్టుకు వస్తున్న మార్గంలో వెన్నుకు పక్కగా డొక్కలోంచి నొప్పి మొదలై కడుపు మీదకు వచ్చి గజ్జల్లోకి, జననాంగంలోకి నొప్పి ప్రాకినట్లుంటుంది.
మూత్రం మంటగా వెళ్తుంది. వాంతులు, జ్వరం కూడా వస్తాయి. తట్టుకోలేనంతగా కడుపునొప్పితో మెలికలు చుట్టుకుపోతాడు రోగి. నీరు అధికంగా త్రాగాలి. ఇప్పుడు త్రాగుతున్న దానికంటే రెండు మూడు రెట్లు నీరు త్రాగితే మూత్రం ఎక్కువగా తయారై రాయిని నెట్టుకొచ్చేస్తుంది.
రాయిని కరిగించేందుకు ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధాలున్నాయి.
పాషాణభేది అనే మూలిక రాయిని పగలగొట్టి బయటకు నెట్టుకొచ్చేoదుకు తిరుగులేనిదిగా పనిచేస్తుంది. కొండపిండి మొక్క అనే పేరుతో ఇది మన ప్రాంతాలలో రోడ్లు ప్రక్కన కూడా దొరికే మొక్క. మొక్కల గురించిన పరిజ్ఞానం ఉన్నవారిని అడిగితే ఈ మొక్కని చూపిస్తారు.
ఏలకుల లోపలి గింజల్ని మెత్తగా నూరి మజ్జిగతో గానీ అరటిపండు రసంతో గానీ తీసుకుంటే మూత్రం చిక్కగా, మంటగా వెళ్ళడం తగ్గి , పొత్తికడుపులో బరువు, నొప్పి తగ్గుతాయి.
అరటిచెట్టు దుంపని సేకరించి ముక్కలుగా తరిగి ఎండబెట్టి మెత్తగా దంచి ఒక సీసాలో భద్రపరచుకోండి. మూత్రపిండాలలో రాళ్ళతో బాధపడుతున్న వారికి ఏ మాత్రం మూత్రంలో మంట, వేడిచేసినా నొప్పి తిరగబెడుతుంది. అందుకని, ఏ మాత్రం వేడి చేసినట్లనిపించినా అరటిదుంప పొడిని 1-2 చెంచాల మోతాదులో పంచదారగానీ తేనెగానీ కలిపి తీసుకుంటే మూత్ర ద్వారం లోంచి రక్తం పడటం ఆగుతుంది. మంట తగ్గుతుంది. నొప్పి కూడా తగ్గుతుంది.
ముల్లంగి దుంప జ్యూస్ త్రాగితే మూత్రంలో మంట తగ్గుతుంది . రాళ్ళు కరుగుతాయి. ఉలవకట్టు , ఉలవచారు తరచూ త్రాగితే మూత్రపిండాల్లో రాళ్లు కరుగుతాయి.
దానిమ్మ పళ్ళు, ఏలకులు, జీలకర్ర సమానంగా తీసుకొని దానికి తగినంత సైoధవ లవణం కలిపి మెత్తగా దంచి మజ్జిగలో కలుపుకొని త్రాగితే మూత్రపు బాధలు తగ్గుతాయి. నొప్పి తగ్గుతుంది
0 Comments