Banana, Shocking facts – You will be Surprised for sure.. Ultimate Benefits No Other Fruit Does.
అరటిపండు :
అరటిపండు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఎక్కువగా తినే పండు . చాలా సర్వసాధారణంగా అందరూ తినేది, తినగలిగేలా ఉన్న ఫ్రూట్ అరటిపండు. అరటిపండంత హాయిగా తినగల పండు మరొకటి లేదు . మనం దీన్ని ఎటువంటి కాలంలోనైనా తినవచ్చు . ఇది మనకు ఎంత అందుబాటులో ఉంటుందో అంతకంటే ఎక్కువ ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది .
అరటిపండు మనసునీ ఉత్తేజ పరుస్తుంది మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది . అంతేకాదు పొటాషియం లోపంతో చాలామంది హార్ట్ ఎటాక్ కు గురవుతున్నారు. రోజు తీసుకునే ఆహారంలో పొటాషియం అవసరం కాబట్టి , రోజూ ఒక అరటిపండైన తీసుకుంటే సరిపోతుంది .
అరటిపండును తినడం వలన శరీరానికి సరిపడా కాల్షియం , ఐరన్ అందుతుంది. పిల్లల ఎదుగుదలకు కూడా అరటిపండు బాగా ఉపయోగపడుతుంది . అంతేకాకుండా అరటిపండులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి . బరువు పెరగాలని అనుకునేవారికి అరటిపండు తినడం వలన మంచి ప్రయోజనం లభిస్తుంది . కండరాల బలహీనతను నివారించడంలో అరటిపండ్లు తోడ్పడతాయి . వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడంలో , ఎసిడిటీని దూరం చెయ్యడంలో , అల్సర్ ను తగ్గించడంలో అరటిపండు కీలకపాత్ర పోషిస్తుంది .
అరటి పండ్లలో చాలా రకాలు ఉంటాయి. గ్రీన్ కలర్ అరటి పండ్లు, పసుపు రంగు అరటి పండ్లు, మచ్చల అరటి పండ్లు, బ్రౌన్ కలర్ అరటి పండ్లు. అయితే వీటిలో ఒక్కో రంగు అరటి పండు ఒక్కో విధంగా ఉపయోగపడుతుంది . బాగా పండిన లేదా రంగుమారిన అరటి పండ్లను (బ్రౌన్ కలర్ అరటిపండ్లు) వాటిని పడేకూడదు వాటిని తినడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. బ్రౌన్ కలర్ అరటి పండ్లలలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని జ్యూస్ చేసుకొని త్రాగడం కానీ బనానా బ్రెడ్‌గా చేసుకొని తింటే మంచిదని చెబుతున్నారు. ఇక గ్రీన్ కలర్ అరటి పండ్లు షుగర్ పెరగకుండా కాపాడతాయి. ఈ రంగు అరటి పండ్లు నెమ్మదిగా జీర్ణమవుతాయి . దీని వలన రక్తంలో గ్లూకోజ్ పరిమాణం నెమ్మదిగా పెరుగుతుంది .
ఇక పసుపు రంగు అరటి పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి తినడం వలన ఎటువంటి రోగాలు మనకు సోకవు . ఇవి చాలా సులభంగా జీర్ణమై బలాన్ని ఇస్తాయి . మచ్చలు ఉన్న అరటిపండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిలో అనేక అనామ్లజనకాలు ఉంటాయి. ఈ రంగు అరటి పండ్లు చాలా రుచికరంగా ఉంటాయి. కానీ మిగతా అరటి పండ్ల కంటే వీటిలో పోషకాలు కాస్త తక్కువగా ఉంటాయి.
అరటిపండులో ఉండే పోషకాలు :
1. అరటిపండులో అత్యధిక స్థాయిలో శక్తి నిల్వలు ఉన్నాయి . అంతేకాకుండా ఇందులో ఎ , బి , సి విటమిన్లు ఉన్నాయి .
2. అరటిపండులో కొవ్వు పదార్ధం ఉండదు . ఇందులో ఆరోగ్యానికి అత్యావశ్యకమైన పీచు ఉంటుంది .
3. అరటి పండులో నీటి భాగం కంటే ఘన పదార్ధ భాగం ఎక్కువ. ఇవన్నీ శరీరాన్ని పోషించే పదార్థాలు కావటంతో దీనిని కేవలం పండుగానే కాకుండా ఆహారంగా కూడా వాడుకోవచ్చు.
4. శరీరానికి మేలు చేసే బాక్టీరియా కూడా అరటిపండులో మనకు లభిస్తుంది .
5. పొగ మానెయ్యాలనుకునే వారికి ఈ అరటిపండు చాలా బాగా ఉపయోగపడుతుంది . ఈ పండులో ఉండే బి6, బి12, పొటాషియం , మెగ్నిషియంలు శరీరంలో నికొటిన్ తగ్గినప్పుడు తలెత్తే దుష్ప్రభావాల్ని తగ్గిస్తాయి .
6. అరటిపండులో పొటాషియం ఎక్కువగా ఉండి సోడియం తక్కువగా ఉండటం వలన బ్లెడ్ ప్రెషర్ ని తగ్గిస్తుంది.
7. ప్రతి రోజూ అరటి పండు తినడం వలన ఇందులో ఉండే ఐరన్, హిమోగ్లోబిన్ ని ఎక్కువ చేసి రక్త హీనతను రాకుండా చేస్తుంది.
8. అరటిపండులో విటమిన్ బి6 కూడా ఎక్కువగా ఉంటుంది . ఇది ఆక్సిజన్ సరఫరా చేసే ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి బాగా తోడ్పడుతుంది .
9. అరటిలోపండులో ఉండే రసాయనాలు మన మెదడుపై ప్రభావం చూపించి , విశ్రాంతిని ఇస్తుంది.
10. కండర సామర్ధ్యం : అరటిపండులో సమృద్ధిగా ఉండే పొటాషియం రక్తప్రసరణ సాఫీగా సాగేందుకు విద్యుద్వాహక లవణంలా ఉపయోగపడుతుంది . పిండిపదార్దాల జీవక్రియను పెంచి , కండరాలు సమర్థంగా పనిచేసేలాగా తోడ్పడుతుంది . పొటాషియం లేకపొతే కండరాలు సరిగ్గా పనిచెయ్యలేవు . కాబట్టి ఒంట్లో కండరసామర్ధ్యానికి అరటిపండు బాగా ఉపయోగపడుతుంది . కండరాల నొప్పిని మీ దరిచేరనివ్వదు.
11. అరటిపండులో ఉండే ‘ఫోలేట్’ ఏకాగ్రత , జ్ఞాపకశక్తిని పెంచటంలో ఉపయోగపడుతుంది .
12. అరటిపండులో మెగ్నీషియం పాళ్ళు ఎక్కువ . ఇది శరీరంలో శక్తిని సరఫరా చెయ్యటంలో కీలకపాత్ర పోషిస్తుంది . దీనివల్ల అలసట నుండి త్వరగా బయటపడవచ్చు .
12. పీచు బాగా ఉండే పచ్చి అరటిపండులో విరేచనాలనూ , మలబద్ధకాన్ని అరికట్టే గుణం పుష్కలంగా ఉంటుంది .
అరటిపండు వలన ప్రయోజనాలు :
1. హార్ట్ సమస్యలు, ఎసిడిటి సమస్యలను అరటిపండు తొందరగా అరికడుతుంది.
2. ఇందులో ఎక్కువగా విటమిన్స్ ఉండటం వలన కంటి చూపుకు కూడా చాలా బాగా పనిచేస్తుంది.
3. అరటిపండ్లు బాగా నిద్రపట్టడానికి మరియు మనలోని కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ఉపయోగపడతాయి .
4. అరటిపండు తినడం వలన పిల్లలకు , విద్యార్థులకు జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
5. రోజూ అరటి పండు తినడం వలన ఇందులో ఉండే ఐరన్, హిమోగ్లోబిన్ ఉత్పత్తిని ఎక్కువ చేసి ‘ఎనీమియా’ రాకుండా చేస్తుంది.
6. అరటిపండులో ఉండే పిండిపదార్థాలు కార్బోహైడ్రేటులు, మాంసాకృతులు ఆహారాన్ని సులభంగా జీర్ణం చేసి మలబద్దకం రాకుండా శరీరాన్ని కాపాడుతుంది.
7 . వారానికి కనీసం ఆరు అరటిపండ్లు తినే ఆడవారిలో కిడ్నీక్యాన్సర్ వచ్చే ప్రమాదo తగ్గుతుందని ఒక పరిశోధనలో వెల్లడైంది .
8. నిద్రలేమిని దూరం చేస్తుంది.
If you’ve any further questions, feel free to contact Dr Santhisree Bheesetti at +91 9989759719
0 Comments