Pimples – Ultimate Home Remedies You Can Do It By Yourself
అందానికీ , ఆనందానికీ శాపంగా నిలిచే ”మొటిమలు ”
మొటిమలు వచ్చాయంటే వయసొచ్చిందని అని అర్ధం. ఈ కాలంలో ప్రతి మనిషికి యవ్వన ప్రాయంలో మొటిమలు రావడం సహజం . కానీ మొటిమలు యుక్తవయస్కుల్లోనే కాకుండా, 55 ఏళ్లు దాటిన వారిలో కూడా వస్తున్నాయి. అసలివి ఎందుకొస్తాయో తెలుసుకుని నివారించుకోవటం ఉత్తమం. మొటిమలు చాలా మందికి ఒక సాధారణ సమస్య. ఇవి సహజంగా జిడ్డు చర్మం కలిగిన వాళ్లని ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాలుష్యం, హార్మోన్‌లలో మార్పులు వల్ల ముఖంపై మొటిమలు వస్తుంటాయి. టీనేజర్స్‌లో ముఖ్యంగా మొటిమలు, బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్, ఇతర సాధారణ చర్మ సమస్య ఇలా చాలానే ఉన్నాయి. మొటిమలు ఎక్కువగా ఉన్నప్పుడు స్క్రబ్‌లు లాంటివి అస్సలు ఉపయోగించకూడదు . అలా చెయ్యడం వలన అవి ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది .
మొటిమలు స్వేదగ్రంధులకు సంబంధించిన చర్మ వ్యాధి. మొటిమలు ముఖము పైనే కాకుండా మెడ, భుజము, ఛాతి పైన కూడా పుడుతూ ఉంటాయి. ముఖముపైన ఉండే నూనె గ్రంధులు చర్మములోని వెంట్రుకల కుదుల్లలో ఉండి యుక్తవయస్సులో ఎక్కువగా జిడ్డును తయారుచేస్తుంది .
సెక్సు హార్మోన్లే మొటిమలకు కారణం :
‘మొటిమలు’ అనే పదం వినగానే చాలామంది మహిళలు భయపడిపోతుంటారు . యుక్త వయసు వచ్చిన దగ్గరనుండి మొటిమలు రావడం మొదలై , ముఖసౌందర్యం పాడై పోతుందనే కొత్త బాధ మొదలవుతుంది . ఆడపిల్లల్లో గాని , మగపిల్లల్లో గాని అన్ని యవ్వన చిహ్నాలతో పాటు మొటిమలు కూడా పిలవకుండానే వచ్చే అతిథిలా వచ్చేస్తాయి .
యవ్వనాన్ని తీసుకు వచ్చే సెక్సు హార్మోన్లే మొటిమల్ని కూడా తీసుకు వస్తున్నాయి . తేలికగా అర్ధం అయ్యేలా చెప్పాలంటే , సెక్సు హార్మోన్లు అనేవి ఆడవాళ్ళలో ఆడతనాన్ని , మగవాళ్ళలో మగతనాన్ని ప్రసాదించే ఉత్ప్రేరకాలన్నమాట . ఆడవాళ్ళలోను మగవాళ్ళలోనూ మొటిమల్ని ఇవి సమానంగానే తీసుకు వస్తాయి .
నెలసరికి ముందు మొటిమల బాధ :
చెమటను పుట్టించేందుకు సెబేషియస్ గ్రంధులనేవి చర్మం అంతా రంధ్రాల్లా వ్యాపించి ఉంటాయి . వెంట్రుకల కుదుళ్ళు కూడా వీటిలోనే ఉంటాయి .యాండ్రోజెన్స్ అనే పురుష సంబంధమైన హార్మోన్లు ఈ సెబేషియస్ చెమట గ్రంథులు పనిచేసే విధానంలో మార్పులు తెచ్చిపెట్టి , అక్కడ పొక్కులు ఏర్పడేలా చేస్తాయి . అవే మొటిమలంటే !!
ఆడవాళ్ళలో సాధారణంగా నెలసరి రావడానికి ముందు మొటిమల బాధ ఎక్కువగా ఉంటుంది . కానీ , కడుపుతో ఉన్నప్పుడు మొటిమలు అంతగా బాధించవు . స్త్రీ, పురుష సంబంధమైన యాండ్రోజెన్ , ఈస్ట్రోజన్ హార్మోన్లు సమాన నిష్పత్తిలో లేనప్పుడు మొటిమలు పెరుగుతాయి . గర్భం ధరించినప్పుడు ఈ హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి . అందుకనే గర్భవతులకు మొటిమలు పెద్దగా రావు .
మొటిమలు ఎలా పుడుతున్నాయి ?
యాండ్రోజెన్ హార్మోన్ల ప్రభావాన కానీ , ఇతర కారణాల వలన కానీ చర్మానికి అడుగున క్రొవ్వు పొరల్లోంచి ‘సీబమ్’ అనే జిడ్డుపదార్ధం అధికంగా విడుదలౌతుంది .ఈ విడుదలైన సీబమ్ , స్వేద గ్రంథుల రంధ్రాల ద్వారా చర్మం పైకి రాకుండా . స్వేద గ్రంధులు మూసుకుపోతాయి . అలా మూసుకు పోవడాన్ని ”కెరటోసిస్ ” అంటారు . ”కెరటోసిస్ ” వలన స్వేద గ్రంథులు బెరళ్ళు కట్టినట్లయి మూసుకుపోతాయి . ఈ బెరళ్ళని ” కెరటోటిక్ ప్లగ్స్ ” లేక ”కొమిడోన్స్ ” అంటారు .ఈ కెరటోటిక్ బెరళ్ళ వలన బయటకు రాకుండా మధ్యలోనే ఆగిపోయిన సీబమ్ జిడ్డు పదార్థంలో సూక్ష్మజీవులు ప్రవేశించి వాపు ఏర్పడి పొక్కులు తయారవుతాయి . అవే మొటిమలు !!
బాగా అడుగు పొరల్లో ఈ సీబమ్ నిలబడిపోతే ఒక్కోసారి చీము గడ్డలు (యాబ్సెస్ ) అయ్యే అవకాశం కూడా ఉంది .
మొటిమలు ఏర్పడినచోట నల్లటి మచ్చలు పడడం , గుంటలు పడడం … ఇలా ముఖ సౌందర్యాన్ని దెబ్బతీసి మొటిమలు యువతరాన్ని పీడించుకు తింటాయి . అందుకే , చర్మ సంరక్షణ మొటిమల విషయంలో అత్యవసరం.
మొటిమలను రాకుండా నివారించగలమా ?
మొటిమలను నివారించాలంటే , మొదటగా మొటిమలకు కారణాలేమిటో రోగికి చక్కగా అర్ధం కావాలి . వ్యాధిని ఎదుర్కొని జయించాలే గానీ , మొటిమలకు లొంగిపోతే ముఖం గుంటలు పడి , నల్లటి మచ్చలతో చీముకురుపులతో భయానకంగా తయారవుతుంది .
ఇప్పటి వరకూ మనం చర్చించిన సారాంశం ఏమంటే , ముఖం మీద చర్మ రంధ్రాలు పూడుకుపోవడం వలన మొటిమలు ఏర్పడుతున్నాయనీ , రెండవది కొవ్వు పదార్ధం ఎక్కువగా తయారవడం కూడా మొటిమలకు కారణమవుతుందని. కాబట్టి చర్మ రంధ్రాలు పూడకుండా చూడడం , పూడితే అవి తెరచుకునేలా చెయ్యడం మొదటి నివారణా సూత్రం . కొవ్వు పదార్ధాలు , నూనెలు , నెయ్యి వాడకం తగ్గించడం , స్వీట్లు తినకుండా ఉండడం ఇవన్నీ రెండో నివారణా సూత్రాలు . మొటిమలకు చికిత్స విషయంలో వైద్యుడితో పాటు రోగికీ చక్కని శ్రద్ధ , ఓర్పు అత్యవసరం .
మొటిమలతో జాగ్రత్తలు :
చూడటానికి మొటిమలు చిన్నగానే ఉంటాయి గానీ యుక్తవయసు పిల్లలను తెగ ఇబ్బంది పెడతాయి. సౌందర్యపరంగానే కాదు.. మానసికంగానూ వేధిస్తాయి. అందుకే ముఖంపై ఒక్క మొటిమ కనబడినా వెంటనే గిల్లేస్తుంటారు. నిజానికి ఇలా గిల్లటం వల్ల మొటిమలు తగ్గకపోగా మరింత తీవ్రమయ్యే ప్రమాదముంది. కాబట్టి మొటిమలు గలవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి.
1. ముఖంపై నూనె లేదా జిడ్డుగా ఉండే ఎలాంటి పదార్థాలనూ రాయకూడదు. ఇలాంటివి చర్మంలోని తైల గ్రంథులు మూసుకునేలా చేసి మొటిమలను మరింత తీవ్రం చేస్తాయి. తప్పనిసరైతేనే ముఖానికి మేకప్ వేసుకోవాలి. అలాగే పడుకునేప్పుడు మేకప్‌ను పూర్తిగా కడుక్కోవాలి.
2. రోజూ షాంపూతో తలస్నానం చెయ్యటం వల్ల ముఖం జిడ్డుబారకుండా ఉంటుంది. తలకు నూనె, క్రీముల వంటివి వాడితే.. అవి ముఖమంతా విస్తరించి, మొటిమలు ఉదృతం కావటానికి దోహదం చేస్తాయి.
3. మొటిమల సమస్య తీవ్రం గలవారిలో కొందరికి తైలగ్రంథుల మార్గంలో అధికంగా నూనె పేరుకుపోవటం వల్ల పసుపురంగులో గానీ నల్లగా గానీ ముఖంపై చిన్న బుడిపెలు (బ్లాక్‌హెడ్స్) ఏర్పడుతుంటాయి. వీటిని గిల్లటం మంచిది కాదు. దీంతో మొటిమలు తగ్గటం ఆలస్యమవుతుంది.
మొటిమల రావడానికి కారణాలు :
మొటిమలు రావడానికి బాక్టీరియా కూడా కారణమే. రక్తంలో మలినాలు చేరడం వల్లే మొటిమలు వస్తుంటాయి . ముఖ్యంగా కాలుష్యం, హార్మోన్‌లలో మార్పులు వల్ల ముఖంపై మొటిమలు వస్తుంటాయి. చర్మానికి అడుగున కొవ్వు పొరలుంటాయి . ఈ కొవ్వు పొరలు చర్మం మీదకి చెమట గ్రంధుల ద్వారా సీబమ్ అనే జిడ్డు పదార్ధాన్ని స్రవింపచేస్తాయి.
పైన మనం చెప్పుకున్న హార్మోన్లలో యాండ్రోజెన్లు ఈ జిడ్డు పదార్థంలో ఉండే రసాయన ద్రవ్యాల్లో మార్పుల్ని తెచ్చి మొటిమల వ్యాధికి కారణం అవుతున్నాయి . పేగులకు సంబంధించిన కొన్ని వ్యాధులు , విటమిన్ల లోపం , రక్తం తక్కువగా ఉండడం , వంశపారంపర్యంగా వచ్చే కొన్ని ప్రభావాలు … ఇవన్నీ మొటిమలకు దారితీసే కారణాలే !!
ముఖం మీద మనకు ఒక్క మొటిమ చాలు అందం పోగొట్టడానికి. అలాంటిది కుప్పలుకుప్పలుగా వచ్చేస్తే మార్కెట్లో లభించే కొన్ని రకాల క్రీములు వాడుతాం . దాని కారణంగా మొటిమలు తగ్గినట్టే మొదట్లో అనిపిస్తుంది . కానీ మళ్లీ రావడం మొదలుపెడతాయి. లేదంటే నల్లటి మచ్చలుగా ఏర్పడతాయి. మరి వీటికి పరిష్కారమే లేదా అంటే.. ఉంది . మొటిమలు తగ్గించడానికి కొన్ని చిట్కాలు మీకోసం… అవేంటో మనం ఈ క్రింద తెలుసుకుందాం !
మొటిమలను నివారించడానికి గృహ చికిత్సలు :
1. మంచుగడ్డను గుడ్డలో చుట్టి మొటిమలు ఉన్న ప్రదేశంలో కొన్ని సెకండ్లు ఉంచండి . దీని వలన రక్తప్రసరణ మెరుగుపడుతుంది .స్వేదగ్రంధులను కూడా గట్టిపరుస్తుంది . దీనితో పాటుగా చర్మంపై ఉన్న దుమ్ము , ధూళి , నూనెలను తొలగించడానికి సహాయపడుతుంది .
2. స్ట్రీమ్ ట్రీట్మెంట్ ముఖానికి చాలా మంచిది . ఇది చర్మరంధ్రాలను తెరచి చర్మం శ్వాస తీసుకునేలా చేస్తుంది . ఒక పెద్ద గిన్నెలో వేడినీళ్ళు తీసుకోండి . ఈ వేడినీటి నుండి వచ్చే ఆవిరి మీ ముఖానికి తగిగేలా కొద్దిసేపు ఉంచండి . గోరువెచ్చని నీళ్ళతో ముఖాన్ని శుభ్రపరచుకోండి . తర్వాత ఏదైనా తేమ ఉన్న లోషన్ ని ముఖానికి రాసుకోండి .
4. తేనె మొటిమల నుండి త్వరగా ఉపశమనం పొందడానికి ఒక అద్భుతమైన చిట్కా . దూది ఉండని తేనెలో ముంచి మొటిమలు ఉన్న చోట రాసి ఒక అరగంట పాటూ ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మొటిమల నివారణకి మరింత ఉపయోగకరంగా ఉంటుంది.
5. నిమ్మరసంలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఒక స్పూన్ నిమ్మరసం , ఒక స్పూన్ నీళ్ళు తీసుకోండి . అందులో ఒక కాటన్ బాల్ ను అందులో ముంచి, మొటిమలు ఉన్న ప్రదేశం దగ్గర రాయండి . అలాగే ఒక 10 నిముషాలు ఉంచిన తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రపరచుకోండి . ఈ విధంగా రోజు తప్పించి రోజూ చేస్తూ ఉంటే మొటిమలు తగ్గుమొఖం పడతాయి .
6. గుడ్డులోని తెల్ల సొనతో కూడా మొటిమలను నివారించుకోవచ్చు అనే విషయం చాలా మందికి తెలియదు . ఒక పచ్చి గుడ్డుని పగలగొట్టి అందులోని తెల్ల సొనని తీసుకోవాలి. ఇప్పుడు దానిని నురగలా వచ్చే వరకూ బాగా గిలక్కొట్టి మొహానికి రాసుకోండి. అది ఆరిన తరువాత మరలా అలానే రెండు మూడు సార్లు మొహానికి రాసుకోండి. 20 నిమిషాల పాటు ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో మొహం కడుక్కోండి .
7. టమాటా రసం, నిమ్మరసం కాస్త తేనె కలిపి ఉదయం వేళ స్నానం చేయడానికి ముందు రాసుకుని, పావుగంట తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మొటిమలు క్రమంగా అంతరిస్తాయి.
8. రాత్రి పడుకోబోయే ముందు గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రంగా కడుక్కుని మెంతి ఆకులతో చేసిన పేస్ట్‌ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేస్తే మొటిమలు మాయమవుతాయి.
9. మీ మొహం మీద మొటిమల్ని తోలగించుకొనుటకు మీ ఇంట్లో లభించే తేనె మరియు దాల్చినచెక్క పొడితో మిశ్రమాన్ని తయారుచేసుకోవచ్చు. దాల్చినచెక్కపొడి మీకు బయట దుకాణాలలో అందుబాటులో ఉంది. ఒక చెంచా తేనెకు రెండు చెంచాల దాల్చినచెక్క పొడిని తీసుకుని వాటిని కలపాలి. ఆ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న చోట రాసుకుని 15 నిమిషాల పాటు ఉంచుకోండి. తరువాత చల్లని నీటితో కడిగేయండి.
10. కమలా పళ్ళ తొక్కలను ఎండ బెట్టి చూర్ణం చేసి మొహానికి రాసుకుంటే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు కూడా పోతాయి.
Book an appointment with us. We are just a Phone call away, Let us Talk.
Phone no : +91 9989759719
0 Comments