Sugar – Negative Effects on Health
తియ్యటి పంచదారలోని కటిక చేదు
అనాదిగా వస్తున్న మన జీవితవిధానం కూడా షుగర్ ఎక్కువగా తినడానికి కారణం అవుతోంది . ఉదాహరణకి ఏదైనా శుభవార్త విన్నా , ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా స్వీట్స్ ఉండాల్సిందే . ఎవరినైనా చూడటానికి వెళ్ళేటప్పుడు మనం వెంట స్వీట్స్ తీసుకుని వెళ్తాo . ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజైతే కేక్ కట్ చేయిస్తాం . పిల్లలు ఏడుస్తుంటే చాకెట్లు ఇచ్చి ఏడుపు మాన్పిస్తాము . ఇలా ప్రతిదాన్నీ మనం స్వీట్స్ తో ముడి పెట్టేస్తాం . ఇక పెళ్ళిళ్ళలాంటి శుభకార్యాలైతే చెప్పనే అక్కర్లేదు . కాబట్టి విడిగా స్వీట్స్ కొనుక్కొని తినడం చాలావరకు తగ్గించాలి . అలాగే బంధువులు , స్నేహితులు ఎవరొచ్చినా వారితోపాటు కాఫీ , టీలు త్రాగటం తగ్గించాలి . పళ్ళరసాలలో పంచదార వేసుకోకుండా త్రాగటం అలవాటు చేసుకోవాలి.
షుగర్ తెచ్చే అనర్దాలివి :
స్థూలకాయం వచ్చే ప్రమాదం ఉంది . పళ్ళు పాడవ్వచ్చు . కొలెస్ట్రాల్ పెరిగి ఫలితంగా గుండెజబ్బులు రావచ్చు . స్త్రీలకు వక్షోజ క్యాన్సర్ మైగ్రేన్ , ఆర్తరైటిస్ కూడా రావచ్చు . శరీరానికి అవసరమైన బి కాంప్లెక్స్ ,క్రోమియం , కాపర్ , కాల్షియం , మెగ్నీషియం వంటివి అందవు . రుతు సంబంధ సమస్యలూ ఏర్పడవచ్చు . తరచూ మూడ్ మారిపోతుంటుంది . టెన్షన్ , డిప్రెషన్ ఎక్కువ అవుతుంది . కడుపులో ఎసిడిటీ ఏర్పడుతుంది .
నాచురల్ షుగర్ అవసరమే :
పళ్ళు , పళ్ళ రసాల నుంచి లభించే షుగర్ వల్ల హాని జరగదు . ఇంకా మనకి కావలసిన విటమిన్లు కూడా శరీరానికి అందుతాయి . క్యారెట్లు , బీట్ రూట్లు , చిలగడదుంప లాంటి వాటినుంచి నాచురల్ షుగర్ లభిస్తుంది . కావాలంటే తేనె , చెరుకురసం కూడా తీసుకోవచ్చు . అయితే తగుమాత్రంగానే తీపిపదార్దాలు తినాలనిపిస్తే ఖర్జురాలు , యాపిల్స్ , మామిడిపళ్ళు తినవచ్చు . అడపాదడపా స్వీట్స్ తిన్నా ఫర్వాలేదు గాని రోజూ తినకండి . ఎందుకంటే తినగతినగ వేము తీపిగా మారితే షుగర్ చేదు అవుతుంది .
కృత్రిమ తీపి :
మధుమేహం , స్థూలకాయం లాంటి రుగ్మతలతో బాధపడేవారు తీపి పదార్దాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది . అయితే చాలామంది తియ్యని పదార్దాలకు అలవాటు పడినవారు వాటిని తినకుండా ఉండలేరు . ఇటువంటి వారికోసం పరిశోధకులు కృత్రిమ తీపినిచ్చే కొన్ని స్వీట్ నర్స్ ను సృష్టించారు . ఈ స్వీట్ నర్స్ ను తినే పదార్దాలలో కలుపుకొని తింటే తియ్యగా ఉంటాయి . కానీ అవి ఎటువంటి హానీ చెయ్యవని ఇప్పటివరకు అందరు భావిస్తున్నారు . అయితే , స్థూలకాయులు కృత్రిమ తీపినిచ్చే స్వీట్ నర్స్ ను తీసుకున్నా వారి బరువును నియంత్రించటం కష్టమైపోయిందని పరిశోధనలు తెలుపుతున్నాయి . కృత్రిమతీపిని తీసుకున్నప్పుడు మెదడు అది నిజమైన తీపిగానే భావించి మెటాబాలిజానికి గురవుతుంది . ఫలితంగా రాబోయే కేలరీలను గ్రహించటానికి మెదడు కొన్ని కణాలను విస్పోటనం చెందించి శక్తిని విడుదల చేయిస్తుంది .
తీపికి దూరంగా … :
పప్పుధాన్యాలు , చిక్కుళ్ళు , కూరగాయలు , తాజాపండ్లు బాగా తినాలి . సాధ్యమైనంత వరకూ శీతల పానీయాలు తాగొద్దు . చాలామంది పూరీలూ , ఇడ్లీలు , దోశలు , ఉప్మా …ఇలా ఏం తింటున్నా దానిలో పంచదార అద్దుకుని తింటుంటారు . ఈ అలవాటు మానుకోవడం మంచిది . చక్కెరతో తయారయ్యే కేకులు, పేస్త్రీలు , బేకరీ ఉత్పత్తుల్ని తగ్గించాలి . స్వీట్లను రోజూ కాకుండా ఎప్పుడన్నా మాత్రమే తినటం మంచిది . ఐస్ క్రీములకు బదులుగా తాజా పండ్లతో తయారుచేసిన డెసర్ట్స్ తీసుకోవటం మేలు . ప్యాక్ లో నిల్వచేసిన పండ్లరసాలు కాకుండా ఇంట్లోనే ఎప్పటికప్పుడు తయారుచేసుకొని త్రాగటం మంచిది .
మరికొన్ని నష్టాలు :
చక్కెరలో పోషకాలేవి ఉండవు . కాని చక్కెర ద్వారా శక్తి క్యాలరీలు మాత్రం శరీరానికి విపరీతంగా అందుతాయి . మరోవైపు మన శరీరానికి విటమిన్లు , మినరల్స్ వంటివాటి అవసరం ఎక్కువగా ఉండడంతో ఈ చక్కెరను జీవక్రియలోకి మార్చటానికి ఒంట్లో ఒంట్లో ఉన్న కణజాలాన్ని కరిగించుకుంటుంది . దీనివల్ల శరీరం బలహీనమవుతుంది . శక్తి కోల్పోతుంది . చక్కెర రోగనిరోధక వ్యవస్థనూ అణచి పెడుతుంది . చక్కెర ఊబకాయం రావటంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది . అతి చురుకుదనం , ఆందోళనం , ఏకాగ్రత లోపం వంటి సమస్యలకు దారితీస్తుంది. ట్రైగ్లిరైడ్లనూ , కొలెస్ట్రాల్ నిల్వల్నీ పెంచుతుంది . కణజాలం సాగే గుణాన్ని కోల్పోయేలా చేసి , వాటి పనితీరును దెబ్బతీస్తుంది . చక్కెర ఎంత ఎక్కువగా తింటే కణజాలం సాగేగుణం , పనితీరు అంతగా దెబ్బతింటాయి .
Book an appointment with us. We are just a Phone call away, Let us Talk.
Phone no : +91 9989759719
0 Comments