Amoebiasis – Ayurvedic Treatment for Positive Results #3
అమీబియాసిస్ వ్యాధికి ఆయుర్వేద చికిత్స :
ఇతర వ్యాధులతో పోల్చినప్పుడు ఆయుర్వేద శాస్త్రంలో అమీబియాసిస్ వ్యాధి గురించి చాలా ముఖ్యమైన విషయాలు చెప్పడం జరిగిందనాలి. జీర్ణకోశ వ్యవస్థ గురించి, జీర్ణప్రక్రియ గురించి ఆయుర్వేద శాస్త్ర గ్రంథాల్లో చెప్పిన విషయాలు ఈనాటి ఆధునిక వైద్యశాస్త్రం చెప్తున్నవాటికి భిన్నం కావనీ , చాలాచోట్ల అదనపు విషయాలు కనిపిస్తాయని కూడా అర్ధం అవుతుంది .
శాస్త్రపరమైన అంశాల జోలికి వెళ్ళకుండా అమీబియాసిస్ వ్యాధి గురించి ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్తుందో మొదట అర్ధం చేసుకుందాం .
1. అతిసార వ్యాధికి కారణమయ్యే అంశాలన్నీ అమీబియాసిస్ వ్యాధికి కారణం అవుతాయి .
2. ఏ కారణం చేత విరేచనాల వ్యాధి కలిగినా , దాన్ని తగ్గించుకోవడానికి గానీ , అది తగ్గిన తర్వాత గానీ , తీసుకోవాల్సిన జాగ్రత్తలు తగినన్ని తీసుకోకపోవడం వలన కూడా అమీబియాసిస్ వ్యాధి దీర్ఘవ్యాధిగా మారుతుంది.
3. ఎంత ఆహారం , ఎలాంటిది తీసుకున్నారనే దాని కన్నా , ఎవరి జీర్ణశక్తి ఎంత అనేది ముఖ్యమైన ప్రశ్న ! జీర్ణశక్తిననుసరించి తగినంత ఆహారమే తీసుకోగలిగితే , అమీబియాసిస్ వ్యాధి తిరగబెట్టకుండా ఆగుతుంది. జీర్ణశక్తి తక్కువ , కఠినంగా అరిగే ఆహార పదార్దాలు తీసుకోవడం ఎక్కువ అయినప్పుడు అమీబియాసిస్ వ్యాధి కడుపులో అలజడిని సృష్టిస్తుంది .
4, జఠరాగ్నికి ‘పుట్టిల్లు ‘ అనదగిన ప్రేగు భాగాన్ని ” గ్రహిణి ” అంటారు . జఠరాగ్నిని చెడగొట్టి , మందగింపచేసే ఆహారాలు తీసుకున్నప్పుడు ఈ గ్రహిణి అనే అవయవం చెడినట్టు లెక్క ! అందుకని ఈ వ్యాధిని ”గ్రహిణీ వ్యాధి ” అని పిలుస్తారు .
5. అమితంగా దప్పిక , ఏ పనీ చెయ్యబుద్ది కాకపోవడం , అజీర్తి , తిన్నది ఎప్పటికోగానీ జీర్ణం కాకపోవడం , శరీరం బరువుగా ఉండటం ….. ఇలాంటి లక్షణాలన్నీ అమీబియాసిస్ వ్యాధి రాబోతుందని హెచ్చరించే అంశాలు . అంటే , ప్రేగుల్లో ‘గ్రహిణి ‘ అనే భాగం దెబ్బతింటోందని అర్ధం!
ఈ ఐదు అంశాల్ని బట్టీ మనకు మౌలికంగా ఒక్క విషయం స్పష్టమైంది . అమీబియాసిస్ వ్యాధి అనేది కేవలం నోటి ద్వారా మాత్రమే కడుపులోకి ప్రవేశిస్తోందనీ , ఈ ద్వారాన్ని మూసేస్తే తప్ప ఈ వ్యాధికి విమోచనం , విముక్తి లేదనీ , అంటే తీసుకునే ఆహారం ద్వారా , నీటి ద్వారా అమీబియాసిస్ అనే గ్రహిణీ వ్యాధి కడుపులోకి ప్రవేశిస్తోంది . అలాంటి ఆహార పానీయాల్ని ఆపడం వలన మాత్రమే ఈ వ్యాధి అదుపులో రావడం సాధ్యం అవుతుంది .
ఇప్పుడు మీకు అసలు విషయం అర్ధం అయ్యే ఉంటుంది . అమీబియాసిస్ వ్యాధి దీర్ఘవ్యాధిగా మారడానికి కారణం జీర్ణశక్తి మందగించడమేనని! పర్వతాలు పలహారం చెయ్యగల జీర్ణశక్తి ఉన్న వ్యక్తికి విషం పెట్టినా అరిగించుకొని ఆనందంగా తిరిగేస్తుంటాడు . అదే జీర్ణశక్తి మందంగా ఉన్న వ్యక్తి అమృతం ఇచ్చినా ఏదొక వ్యాధి లక్షణాన్ని తెచ్చిపెడుతూనే ఉంటుంది! అమీబియాసిస్ వ్యాధి ఇలానే దీర్ఘవ్యాధిగా మారి విడవకుండా జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది .
అందుకని , అమీబియాసిస్ వ్యాధితో తరచూ బాధపడేవారు తమకు తాముగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఇప్పుడు ఆయుర్వేద శాస్త్రం ఏం చెబుతుందో పరిశీలిద్దాం …..
1. పాతబియ్యం , తేలికగా అరిగేవి మాత్రమే తినండి . కొంచెం దోరగా వెయ్యించి వండుకుంటే , తేలికగా అరుగుతాయి .
2. మరమరాలు (వరిపేలాలు ) జావలాగా కాచుకొని త్రాగితే అరుగుదల బాగుంటుంది . సగ్గుబియ్యంజావ, బార్లీజావ అమీబియాసిస్ వ్యాధిలో ప్రేగుల్ని బలసంపన్నం చేస్తాయి .
3. కందికట్టు , పెసరకట్టు , చింతపండు వెయ్యని పప్పుచారు ఈ వ్యాధిలో ప్రేగుల్ని కాపాడుతుంది .
4. పెరుగు , దానికన్నా చక్కగా చిలికిన మజ్జిగ ఈ వ్యాధిలో అమృతంలా పనిచేస్తాయి . అమీబియాసిస్ వ్యాధిలో మజ్జిగే అసలైన మందులా ఉపయోగపడుతుంది .
5. నువ్వుల నూనెని వంటకాలకు వాడడం మంచిది . అయితే , నూనె అతిగా వాడకూడదు .
6. మంచి తేనే , పటికబెల్లం , ఎండుద్రాక్ష , నేరేడు పండు , వెలగపండు , దానిమ్మపండు , పొగడపండు , అరటిపండు , బూడిదగుమ్మడి ఈ వ్యాధిలో తప్పనిసరిగా తీసుకోవలసిన అంశాలు .
7. లేత అరటి కాయల్ని నిప్పుల మీద కాల్చిగానీ , ఉడకబెట్టి గానీ వండిన కూర ఈ వ్యాధికి బాగా ఉపయోగపడుతుంది .
8. పెరుగు , పచ్చడి రూపంలో వండిన ఆహారపదార్దాలు ఎక్కువ మేలుచేస్తాయి .
9. నెయ్యి , వెన్నపూస , మీగడ ప్రేగుల్ని సంరక్షించి అమీబియాసిస్ వ్యాధి నుండి కాపాడతాయి .
10. కుందేలు , మేక మాంసాలు ఈ వ్యాధిలో మేలు చేస్తాయి .
11. ఉల్లిపాయలతో చేసిన పెరుగుపచ్చడి మంచిది .
12. చద్దన్నం, పులిసిపోయిన వస్తువులు, పాచిపోయినవి పొరబాటున కూడా తినకండి .
13. గోంగూర , బచ్చలి , చుక్కకూర , చింతపండు వేసి వండిన ఆహార పదార్దాలు , కంద , పెండలం , చేమదుంప , బంగాళదుంప , రేగుపళ్ళు , మామిడికాయలు , నారింజ , ముదిరినకొబ్బరి , పచ్చిదోసకాయ ….. ఇవి తిన్నప్పుడు అమీబియాసిస్ వ్యాధిని పిలిచినట్టే అవుతుంది .
14. పాలు , పాలుపోసి వండిన తీపిపదార్దాలు , శనగపిండితో వండిన తీపిపదార్దాలు అపకారం కలిగిస్తాయి . పాలు ఈ వ్యాధిలో పూర్తిగా నిషేధం .
15. శనగలు , మినుములు , బఠాణీలు , పెసలు , వాటి పిండితో తయారయిన వంటకాలు ఖచ్చితంగా చెరుపుచేసి తీరుతాయనని గుర్తించండి .
16 . చేపలు , రొయ్యలు , పందిమాంసం , ముదురు కోడిమాంసం ప్రేగుల్ని దెబ్బతీస్తాయి .
17. పొగత్రాగడం , ఆల్కహాలు , గుట్కాలు , జర్దాలు , అమీబియాసిస్ వ్యాధిలో అపకారం చెయ్యడమే కాకుండా అల్సర్లు రావడానికి కూడా కారణం అవుతాయి .
18. అరటిపువ్వు , అరటి ఊచ , అరటి దుంప వీటన్నింటినీ ఆహార పదార్దాలుగా వండుకొని తింటే , అమీబియాసిస్ వ్యాధి అదుపులోకి వస్తుంది . పెరుగు కలిపి తాలింపు పెట్టుకుంటే ఇంకా ఎక్కువ మేలు చేస్తుంది .
19. బూడిద గుమ్మడి కాయ లోపలి గుజ్జును కూడా పచ్చిగాగానీ , ఉడికించిగానీ , పెరుగు పచ్చడిగా చేసుకొని తింటే , ప్రేగులకు మేలునిస్తుంది.
అమీబియాసిస్ వ్యాధిలో ఔషధ గుణాలు :
అమీబియాసిస్ వ్యాధి వచ్చినప్పుడు విరేచనం ఎక్కువసార్లు అవ్వడమో , అస్సలు అవ్వకుండా బిగదీసి బాధించడమో చేస్తుంది . కరక్కాయ లోపలి గింజలు తీసేసి పై బెరడుని మెత్తగా దంచిన పొడిని అరచెంచా మోతాదులో తేనెలో తీసుకోండి . లేదా మజ్జిగలో కలిపి త్రాగండి . విరేచనం ఫ్రీగా అవుతుంది .
Book an appointment with us. We are just a Phone call away, Let us Talk.
Phone no : +91 9989759719
0 Comments