Asthma – An Ultimate Home Remedies you can do it by yourself
ఆయాసాన్ని(ఊపిరి అందకపోవడం ) అధిగమించడానికి చక్కటి గృహ చికిత్స : శ్వాస లో స్వేచ్ఛ కొసం ఇలా చేయండి
ఆయాసం అనేది ఒక వ్యాధి . ఇదొక వ్యాధి లక్షణం. చాలా మంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు , పోరాడుతూ ఉంటారు . ఊపిరి ఆడకుండా, ఉండి, శ్వాస తీయటం కష్టంగా మారటాన్ని ఆస్తమా అంటారు. దీనిని ఆయుర్వేదంలో ఉబ్బసం అంటారు . ఆంగ్లవైద్యంలో ఆస్తమా అంటారు . ఇది శ్వాస వ్యవస్థ మరియు రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధిగా పరిగణించబడింది .ఆస్తమా ఉన్నవారికి ఎలెర్జీ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది . దీని వల్ల ఊపిరితీత్తులలో గాలిమార్గానికి రంధ్రం ఏర్పడి శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉంటుంది . ముక్కు ద్వారా గాలి తీసుకుని వదిలే ప్రయత్నం లేకుండా మనకి తెలియకుండానే నిరంతరం సాగే పక్రియ!
ఆస్తమా(Asthma) అన్ని వయస్కుల వారిలో వస్తుంది. ముఖ్యంగా దుమ్ము ధూళి, వాతావరణ కాలుష్యంవల్ల నేడు అధిక శాతం మంది ఆస్తమా బారిన పడుతున్నారు. ఈ ఆస్తమా వలన ఛాతిలో నొప్పి , దగ్గు , శ్వాసకోశ మార్గంలో వాపు ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి . ఏదైనా పని చేసినా , లేదా వ్యాయామం చేసినప్పుడు ఈ సమస్య అదికమౌతుంది. అంటే ఇళ్లు దుమ్ము దులపడం వలన , పడని పదార్థాలు తినడం వల్ల , పడని గాలిని పీల్చడం, శీతల ప్రాంతంలో తిరగడం వంటివాటి ద్వారా ఎలర్జీ వచ్చి తద్వారా ఆయాసం వస్తుంది. ఒక్కొక్క సారి మానసికంగా ఉధ్రేకపడిన కూడా ఆయాసం రావచ్చు. చిన్నపిల్లల్లో కనబడే పాలుపడక, ఆ తర్వాత వచ్చే వ్యాధులకి సరిగ్గా చికిత్స చేయించకపోవడం వల్ల కూడా ఈ ఆస్త్మా వస్తుంది.
గాలి వేగంగా పీల్చడం, వదలడం ఇబ్బందికరంగా మారుతుంది. కాసేపు నడిచినా, ఏదైనా పని చేసినా కూడా ఆయాసం వచ్చేస్తుంది. గొంతులో ఈల వేసినట్టుగా శబ్దం వస్తుంది. ఛాతిలో బిగుసుకుపోయినట్టు అనిపిస్తుంది.
ఎలాంటి కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది
1) అజీర్ణము వలన కూడా ఉబ్బసం వ్యాధి రావచ్చును .
2) ధూమపానం(Smoking), మద్యపానం(Drinking), వాయు కాలుష్యం(Pollution), రసాయనాల వాసన పీల్చడం వల్ల కూడా ఆస్తమా వస్తుంది.
3) మానసిక వేదనకు లోనైనా , ఆందోళనగా ఉన్నా కూడా ఆయాసం రావచ్చు .
4) ఎక్కువగా చల్లని ప్రదేశాల్లో తిరగడం .
5) ఐస్ క్రీమ్స్ , కూల్ డ్రింక్స్ వంటివి ఎక్కువగా తాగడం .
6) సైనసైటిస్ ఉన్న వారికైతే కొంతకాలానికి ముదిరి ఆస్తమా వ్యాధిగా మరవచ్చును .
7)తల్లికి పొగతాగే అలవాటు ఉన్నా దాని ప్రభావం కడుపులో ఉన్న బిడ్డపై పడి, అది ఆస్తమాకు దారి తీసే అవకాశముంది.
8) తల్లిదండ్రులు ఆస్తమా బాధితులు అయితే, పిల్లలకు కూడా అది వచ్చే అవకాశం ఉంది.
ఒకవేళ ఈ Asthma సమస్య మీకు ఉంటే ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం !
Asthma- Home Remedies:
ఈ కింద ఉన్న గృహ చిట్కాలను ఆచరిస్తే మీ సంపూర్ణ ఆరోగ్యాన్ని తిరిగి మీరు పొందగలరు .
నాగకేసరాలు , మిరియాలు , పిప్పళ్ళు, శొంఠి ఈ నాలుగుంటిని విడివిడిగా గానీ , లేదా నేరుగా గానీ నెయ్యిలో వేయించండి . అన్నింటిని కలిపి దంచడం గానీ లేదా మిక్సీ పట్టడం గానీ చేసి, ఈ మొత్తానికీ సమానంగా పంచదార కలిపి 1/2 చెంచాల పొడిని రోజూ మూడు పూటలా తింటే ఆయాసానికి బాగా పనిచేస్తుంది . చర్మవ్యాధులకు, మొలల వ్యాధులకు , దగ్గు, జలుబు, గొంతుకు, సంబంధించిన వ్యాధులకు కూడా ఈ చిట్కా అద్భుతంగా ఉపయోగపడుతుంది .
రెండు చెంచాల అల్లం రసంలో , ఒక చెంచా తేనె కలిపి తాగితే ఆయాసం తగ్గుతుంది . ఫ్రీగా విరేచనం అవుతుంది . దీనివలన పొట్టలో బరువు , గుండెలో బరువుగా వుండటం తగ్గుతుంది .
కరక్కాయ పొడిని గానీ , లేదా శొంఠి పొడిని గానీ అర చెంచాడు మోతాదులో సరిపడ బెల్లం కలిపి రెండు పూటలా తరచూ తీసుకున్నట్లయితే రక్త హీనత మెరుగుపడి , ఆయాసం తగ్గుతుంది .
ఆవనూనె మీకు షాపుల్లో దొరుకుతుంది .మీకు సరిపడినంత పాత బెల్లాన్ని తీసుకొని మెత్తగా నూరి , అది తడిసి ముద్దయ్యేవరకూ ఆవనూనెను అందులో కలిపి బాగా నూరండి . ఉదయం , మరియు సాయంకాలం పెద్ద ఉసిరికాయంత ఉండలు చేసుకొని రోజూ తినండి. ఇలా మూడు వారాలపాటు క్రమం తప్పకుండా చేస్తే ఆయాసం నిస్సందేహంగా తగ్గుతుందని వైద్యశాస్త్రం చెప్తుంది.
ఆయాసం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు వంద గ్రాముల వామును వేడి చేసి పల్చని గుడ్డలో మూటగట్టి వీపు పైన, గొంతు పైన ఇరువైపులా కాపడం పెట్టుకుంటే కఫం కరిగి బయటకు వచ్చి శ్వాస కుదుటపడుతుంది.
Asthma బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు :
* ఆయాసం ఉన్న రోగి వెల్లకిలా పడుకోకుండా తలని ఎత్తులో పెట్టుకొని కూర్చున్న స్థితిలో పడుకోవాలి .
* చలి గాలిలో బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ముఖానికి గుడ్డ (మాస్క్ ) కప్పుకొని వెళ్ళాలి .
* వయసు పైబడిన వారు అయితే చలిగాలిలో వేకువజామున తిరగకుండా, కొద్దిగా ఎండ వచ్చిన తర్వాత బయటకు రావడం మంచిది.
* దుమ్ముదూళి, వాహన కాలుష్యం, పారిశ్రామిక కాలుష్యానికి దూరంగా ఉండాలి.
For More updates please click to follow. For information on Nose Bleeding Click Here
0 Comments