Ayurvedic Treatment For Anal Fistula!

Home Remedies

Ayurvedic Treatment For Anal Fistula!!

ఫిస్టులా అనే పదం వినగానే చాలా మంది ఇబ్బందికి గురి అవుతారు దీనిని భగంధరం  వ్యాధి అని అంటారు. ఈ వ్యాధితో బాధపడుతున్నామని ఎవరికైనా చెప్పుకోవడానికి గాని , డాక్టర్ వద్దకు వెళ్లి చికిత్స  తీసుకోవడానికి గాని చాలా సిగ్గుపడుతూ ఉంటారు . ఆడవాళ్లు అయితే ఈ వ్యాధితో అవస్థ పడుతున్నామని భర్తకు చెప్పుకోడానికి కూడా సిగ్గు పడతారు . అలా సిగ్గు పడి నిర్లక్ష్యం చెయ్యడం వల్ల  వ్యాధి తీవ్రత పెరిగి వాళ్లలో ఎంతో అసౌకర్యాన్ని కలిగిస్తుంది .

అసలు ఫిస్టులా (Anal Fistula) అంటే ఏంటి ?

                                            మలద్వార సమీపంలో చిన్న  బుడిపె ఏర్పడుతుంది .  ఆ బుడిపె మధ్యలో చిన్న రంధ్రం ఉంటుంది .  ఆ బుడిపె పెరుగుతూ  లోపల పెద్ద పేగు చివరి భాగం వరకు వెళ్తుంది . ఆ బుడిపె కొంత మందిలో పగిలి ఆ రంధ్రం నుండి చీము మరియు రక్తం కారుతూ చాలా అసౌకర్యానికి గురి అవుతారు . దీనినే ఫిస్టులా అంటారు .
కొన్ని సార్లు ఆ ఫిస్టులా మధ్యలో ఉండే రంధ్రం మూసుకుపోయి ఆ లోపలే చీము మరియు రక్తం నిల్వ ఉండి తీవ్ర వేదన {నొప్పి} కు గురి చేస్తుంది .
తేలిక భాషలో చెప్పాలంటే.. గోడలో పైనుంచి ఒక నీళ్ల గొట్టం వస్తోందనుకుందాం. ఆ గొట్టం ఎక్కడన్నా పగిలితే దాని నుంచి నీరు బయటకు లీకై.. అక్కడ గోడను పాడుచేసి.. ఏదోవైపు నుంచి బయటకు వస్తుంటుంది. ఒక రకంగా భగందరం కూడా అంతే. మలద్వారం నుంచి బయటకు ‘దారులు’ ఏర్పడటం, ఇవి చుట్టుపక్కల చర్మం మీద ఎక్కడో పైకి తేలటం ఈ సమస్యకు మూలం. ఇలా ఎందుకు జరుగుతుందో చూద్దాం.
మలద్వారం లోపలి గోడలకు కొన్ని గ్రంథులు (యానల్‌ గ్లాండ్స్‌) ఉంటాయి. ఇవి మల మార్గంలో జిగురులాంటి స్రావాలను విడుదల చేస్తూ.. మలవిసర్జన సాఫీగా జరిగేలా సహకరిస్తుంటాయి. వీటి మార్గాలు మలద్వారంలోకి తెరచుకొని ఉంటాయి.
ఏదైనా కారణాన వీటి మార్గం మూసుకుపోతే వీటి నుంచి వచ్చే జిగురు స్రావాలు మలమార్గంలోకి రాకుండా లోపలే నిలిచిపోతాయి. మెల్లగా మలంలో ఉండే బ్యాక్టీరియా సూక్ష్మక్రిముల వంటివి దీనిలో చేరి చీము పడుతుంది. దీంతో ఇది చీముగడ్డలా (యానల్‌ ఆబ్సెస్‌) తయారవుతుంది.
ఈ చీము బయటకు వచ్చే మార్గం లేక.. పక్కనున్న కండరాలను తొలుచుకుంటూ అక్కడి ఖాళీల మధ్య నుంచి క్రమంగా లోలోపలే  విస్తరించటం మొదలుపెడుతుంది. ఇది మెల్లగా మలద్వారం చుట్టుపక్కల ఎక్కడో చోటకు చేరుకుని.. అక్కడ పైకి సెగగడ్డలా కనబడుతుంది. దీనికి రంధ్రం పడితే ఇందులోంచి చీము బయటకు వస్తుంటుంది. అయినా పైన ఇన్ఫెక్షన్‌ సోకిన గ్రంథి అలాగే ఉంది కాబట్టి తిరిగి మళ్లీ మళ్లీ చీము వస్తూనే ఉంటుంది.
మలద్వారం దగ్గర వచ్చే సమస్యలు గురించి మాటల్లో చెప్పడం కష్టం . ఈ  సమస్యల గురించి చెప్పుకోడానికి సిగ్గుపడకుండా మలద్వారం దగ్గర ఏ చిన్న అసౌకర్యం కలిగినా  వెంటనే వైద్యులకు చూపించుకొని ఆ సమస్య గురించి మరియు దాని నివారణ మార్గాలు గురించి తెలుసుకొని చికిత్స చేయించుకోడం ఉత్తమం .
చాలా మంది మలద్వారం వద్ద వచ్చే సమస్యలన్నింటిని మొలల వ్యాధి {పైల్స్ } అని అనుకుంటారు . కానీ మలద్వారం వద్ద చిన్న చిన్న చీలికలు {ఫిషర్స్} రావచ్చు . లేదా మల ద్వారానికి సమాంతరంగా మరో మార్గం  {ఫిస్టులా } (Anal Fistula)ఏర్పడవచ్చు . ఇవన్నీ వేర్వేరు సమస్యలు .
ఫిషర్స్ ఉంటే చాలా భాధగా ఉంటుంది .  మొలలకు అంత  బాధ ఉండదు . అవి బయటకు వచ్చినప్పుడు , లేదా వాటిలో రక్తం గడ్డ కట్టినప్పుడు మాత్రమే నొప్పి ఉంటుంది .
ఫిస్టులా సంగతి తీసుకున్నపుడు అది మలద్వారం చుట్టుపక్కల ఎక్కడో ఉంటుంది , దాని  నుంచి  ఎప్పుడు రసి , లేదా  చీము వంటిది కారుతుంటుంది .

Ayurvedic Treatment For Fistula in Ano!!!

అసలు ఫిస్టులా(Anal Fistula) ఏర్పడానికి గల కారణాలను తెలుసుకుందాం :
                                         ఫిస్టులా అనేది ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చే సమస్య . పెద్ద పేగు నుంచి బయటకు వచ్చే చర్మానికి ఇన్ఫెక్షన్ వల్ల వ్యాధి వస్తుంది . అయితే ఈ ఇన్ఫెక్షన్లు ఎందుకు వస్తాయన్నది ఇంతవరకు ఖచ్చితముగా తెలియదు .
ఎటువంటి వారిలో ఈ (Anal Fistula)సమస్య ఎక్కువ కనిపిస్తుంది ?
                           ఈ వ్యాధి ఏ వయసులో ఉన్న వారికైనా రావచ్చు . ముఖ్యంగా ఎక్కువ సేపు కూర్చొని ఉన్న వారిలో ఈ వ్యాధి వస్తుంది .
దీర్ఘకాలంగా మలబద్దకంతో బాధపడుతున్న వాళ్ళు మలద్వారం  సమీపాన సరి అయిన  పరిశుభ్రతను పాటించకపోవడం వల్ల  వాళ్ళలో చీము గడ్డలు ఏర్పడే అవకాశం ఉంది .
                                     అపరిశుభ్రమైన డ్రాయర్లు ధరించేవారిలో , మధుమేహ వ్యాధి ఉన్న వారిలో , డ్రైవింగ్ వృత్తిలో ఉన్న వారిలో , మరికొందరిలో వంశపారంపర్యంగానూ  కూడా చీము గడ్డలు సంభవించవచ్చు .
క్షయ వ్యాధి వల్ల కూడా ఫిస్టులా సంభవించవచ్చు . దీనిని టి .బి  మందులు వాడకం ద్వారా కూడా  తగ్గించవచ్చు
లక్షణాలు :Symptoms Of Anal Fistula:
1.  మలద్వారం చుట్టూ నొప్పి మరియు చికాకు అనేవి ప్రధాన లక్షణాలు .
2.  కూర్చున్నప్పుడు లేదా కదులుతున్నప్పుడు లేదా ప్రేగు కదలిక సమయంలో తీవ్రమైన కండర నొప్పి
3. మలంలో చీము లేదా మలంలో రక్తం కారడం లేదా మలద్వార చర్మం సమీపంలో ఒక మురికి వాసన రావడం
4. మలద్వారం చుట్టూ వాపు మరియు ఎరుపు , జ్వరం , చలి , అలసట మరియు అనారోగ్యం వంటివి అదనపు లక్షణాలు .
 5. విసర్జన క్రియ సరిగ్గా లేకపోడం
6. మలద్వారం దగ్గర దురద
7. మలద్వారం చుట్టుప్రక్కల నుంచి చీము మరియు రసి కారడం
8. రక్తస్రావం
పై  లక్షణాలతో పాటు మరి కొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి .
* కడుపు ఉబ్బరం
*జీర్ణ క్రియ సరిగ్గా లేకపోడం
*ఆహారంపై ఆసక్తి లేకపోడం
*నీరసం నిస్సత్తువ
*నడుం నొప్పి
*మలబద్దకం
 ఫిస్టులాను రెండు రకాలుగా వర్గీకరిస్తారు . మలద్వారానికి పోయే పై దారిలో ఏర్పడేది ఒక రకం . కింది భాగంలో ఏర్పడేది మరో రకం .
 1. లో లెవెల్  – దీనిలోని ఫిస్టులా మార్గం పొడవు తక్కువుగా అంటే రెండు సెంటీమీటర్లు కంటే తక్కువుగా ఉంటుంది .
 2. హై లెవెల్ – దీనిలో ఫిస్టులా మార్గం పొడవు ఎక్కువుగా ఉంటుంది  అంటే 4, 5 సెంటీమీటర్లు కన్నా ఎక్కువుగా ఉంటుంది .
వ్యాధి నిర్ధారణ :
                 ఫిస్టులాను చాలా వరకు చెప్పే లక్షణాలను బట్టే నిర్ధారించవచ్చు . కొంత మంది వైద్యులు వేలితో పరీక్షించి నిర్ధారణ చేస్తారు . మలద్వారం లోపల గాని బయట గాని వేలి పెట్టి చూడడం వల్ల రంధ్రం తగులుతుంది. బాగా అనుభవం ఉన్న వైద్యులు ఆ రంధ్రం నుండి మార్గం ఎంతవరకు వెళుతుందో కొంతవరకు తెలుసుకోగలుగుతారు .
                             ఎండోయానల్‌ స్కాన్‌: సన్నగొట్టంలా ఉండే అల్ట్రాసౌండ్‌ పరికరాన్ని మలద్వారంలోకి పంపి పరీక్షిస్తారు. దీంతో ఫిస్టులా మార్గం లోపలికి తెరచుకొని ఉంటే గుర్తించొచ్చు. సాధారణంగా మలద్వార కండరాల్లో ఎక్కడా గాలి ఉండదు. ఒకవేళ గాలి ఉన్నట్టు తేలితే అక్కడ మార్గం ఉన్నట్టుగా గుర్తిస్తారు. ఇది చవకైన, తేలికైన పరీక్ష.
* ఎంఆర్ఐ: ఫిస్టులా దారులు మరీ సంక్లిష్టంగా ఉంటే ఎంఆర్ఐ స్కానింగు చెయ్యాల్సి ఉంటుంది. దీనిలో ఎన్ని దారులు ఎలా ఉన్నదీ స్పష్టంగా తెలుస్తుంది.
                            పై పరీక్షలు ఆధారంగా లోపల ఎన్ని మార్గాలు ఉన్నాయో తెలుసుకోవడం సులభమవుతుంది .  ఫిస్టులా మార్గం ఎక్కడినుండి మొదలై ఎటు వెళ్తుంది అని తెలుసుకోవచ్చు .
తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
1. శరీరానికి సరిపడా నీళ్లు త్రాగాలి ,దాని వల్ల మలబద్దకం సమస్య కలగదు .
2.జంక్ ఫుడ్ మరియు ఫాస్ట్ ఫుడ్ avoid చెయ్యాలి .
3. టైం కి ఆహరం తీసుకోవాలి
4. తినే ఆహారంలో సమతుల్యత ఉండేలా చూసుకోవాలి
5. పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి .
6.విరేచనం సాఫీగా ఉండేలా చూసుకోవాలి .
7. ముఖ్యంగా స్త్రీలు రెండు ప్రసవాల మధ్య దూరం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి .
8. మలద్వారాన్ని వేడి నీటితో శుభ్రపరుచుకోవలెను .
9. ఎక్కువ సమయం కూర్చుని పనిచేసేవారు అలా కూర్చొని ఉండిపోకుండా మధ్యమధ్యలో లేచి అటు  ఇటు తిరగవలెను.
10. ప్రతి రోజు ఉదయాన్నే గోరు వెచ్చని నీరు తీసుకోవలెను .
11. ఆకుకూరలు , కూరగాయలు ఎక్కువగా తీసుకోవలెను .
12. టీ , కాఫీ లకి దూరంగా ఉండాలి .
13. మలద్వారం ఎప్పుడు పొడిగా , శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి .
14.  మానసిక ఒత్తిడి లేకుండా ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి .
15.  ఉడికించిన కూరగాయలు , ఫ్రూట్ సలాడ్స్ ఎక్కువగా తీసుకోవాలి .
16. కారం , మరియు మసాలాలకు దూరంగా ఉండాలి .
17.  మద్యం సేవించడం మరియు ధూమపానానికి దూరంగా ఉండాలి .
చికిత్సా  విధానం :
         ఆధునిక వైద్యపరంగా ఫిస్టులాకి సర్జరీ తప్ప వేరే మార్గం లేదు . సర్జరీ చేసిన తర్వాత కూడా మళ్లా మళ్లా ఈ అవస్థ పునరావృతం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి .

Ayurvedic Treatment For Anal Fistula!!

                         క్షార సూత్ర పద్ధతి ద్వారా మలద్వారం వద్ద కలిగే అన్ని రకాల సమస్యలు పరిష్కరించబడతాయి .
కొన్ని రకాల ఔషధాలతో లేపించబడిన దారాన్ని మలద్వారం నుంచి ఫిస్టులా లోకి పంపించి బయటకు లాగి ముడి వేస్తారు.ఈ దారం లోపల నుండి కోసుకుంటూ గాయాన్ని తగ్గిస్తూ బయటకు వస్తుంది .  ఈ దారాన్ని ఆయుర్వేద వైద్యులు నిర్ణీత సమయం ప్రకారంగా మారుస్తూ ఉంటారు . ఈ క్షార సూత్ర చికిత్స పద్ధతిని W . H . O వారు పరిశోధన చేసి ఆమోదించారు .
పరిశోధనల  ద్వారా క్షార సూత్ర చికిత్స విధానంతో ఫిస్టులా(Anal Fistula) పునరావృతం అయ్యే అవకాశాలు చాలా తక్కువని చెప్పారు .
ఈ క్షార సూత్ర చికిత్స చేసుకున్నవారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు. దినచర్యలు మానుకొని ఇంట్లోనే ఉండాల్సిన అవసరం లేదు .
రక్తస్రావం  లేకుండా, శస్త్ర చికిత్స లేకుండా ఈ Anal Fistula  ని అతి తేలికగా, పూర్తిగా నిర్మూలించవచ్చు. మధుమేహ రోగులకు, రక్త పోటు ఉన్నవారికి కూడా ఈ క్షార సూత్ర చికిత్స ఎంతో ప్రయోజనకరమని ఆధునిక వైద్య శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు.
#Appointments కొరకు సంప్రదించవలసిన నెంబరు -#9989759719

అమృత ఆయుర్వేదం పంచకర్మ హాస్పిటల్,
Dr.#BheesettiSanthisree
D. No 4-62-7/A/1plot No -162,MIG,
Main Road, 1st Floor,
Lawsons Bay Colony,
Near Baba Bazaar
#Visakhapatnam,
Andhra Pradesh 530017

0 Comments

Submit a Comment

Your email address will not be published. Required fields are marked *

Dr. Santhisree Bheesetti

Driven by her passion, she has cultivated a profound understanding of complex conditions like Autism, ADHD, Cerebral Palsy, Down Syndrome, Speech disorders, and Anxiety disorders, alongside her specialization in Women’s issues and Neurological disorders in adults.
Nose Drops to Brain Power: How Ayurveda Helps Kids with Autism

Nose Drops to Brain Power: How Ayurveda Helps Kids with Autism

We often think of the nose as just for breathing and smelling. But in Ayurveda, the nose is a powerful gateway to the brain, especially when it comes to helping kids with conditions like autism, ADHD, and speech delays. Let’s dive into how simple nose drops can make a...

Significance of Dinacharya in Maintaining Healthy Sleep Patterns

Significance of Dinacharya in Maintaining Healthy Sleep Patterns

Our bodies are designed to function according to a natural rhythm called the Circadian rhythm. This internal clock governs our sleep-wake cycle and is heavily influenced by natural cues such as Sunlight and Darkness. • Sunlight triggers signals in the brain to stay...

Nabhi Vasti: An Ancient Solution for Modern Gut Health

Nabhi Vasti: An Ancient Solution for Modern Gut Health

Nabhi Vasti is a traditional Ayurvedic treatment that focuses on the naval area, known as the Nabhi or Nabhi Marma. In Ayurveda, the naval is considered the center of the body's energy and the gateway to the digestive system. This therapeutic procedure involves the...

Ready to Restore Harmony in Your Mind, Body, and Spirit

Our Treatments

Panchakarma

Shiro Abhyanga

Nasya Karma

Takradhara

Vasti Benefits

Open chat
1
Hi!
How Can I Help You?