Sugar – Negative Effects on Health #9

Ayurvedam Treatment | Home Remedies

Sugar –  Negative Effects on Health

తియ్యటి పంచదారలోని కటిక చేదు

అనాదిగా వస్తున్న మన జీవితవిధానం కూడా షుగర్ ఎక్కువగా తినడానికి కారణం అవుతోంది . ఉదాహరణకి ఏదైనా శుభవార్త విన్నా , ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా స్వీట్స్ ఉండాల్సిందే . ఎవరినైనా చూడటానికి వెళ్ళేటప్పుడు మనం  వెంట స్వీట్స్ తీసుకుని వెళ్తాo . ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజైతే కేక్ కట్ చేయిస్తాం . పిల్లలు ఏడుస్తుంటే చాకెట్లు ఇచ్చి ఏడుపు మాన్పిస్తాము . ఇలా ప్రతిదాన్నీ మనం స్వీట్స్ తో ముడి పెట్టేస్తాం . ఇక పెళ్ళిళ్ళలాంటి శుభకార్యాలైతే చెప్పనే అక్కర్లేదు . కాబట్టి విడిగా స్వీట్స్ కొనుక్కొని తినడం చాలావరకు తగ్గించాలి . అలాగే బంధువులు , స్నేహితులు ఎవరొచ్చినా వారితోపాటు కాఫీ , టీలు త్రాగటం తగ్గించాలి . పళ్ళరసాలలో   పంచదార వేసుకోకుండా త్రాగటం అలవాటు చేసుకోవాలి.

  షుగర్ తెచ్చే అనర్దాలివి :

స్థూలకాయం వచ్చే ప్రమాదం ఉంది . పళ్ళు పాడవ్వచ్చు . కొలెస్ట్రాల్ పెరిగి ఫలితంగా గుండెజబ్బులు రావచ్చు . స్త్రీలకు వక్షోజ క్యాన్సర్ మైగ్రేన్ , ఆర్తరైటిస్ కూడా రావచ్చు . శరీరానికి అవసరమైన బి కాంప్లెక్స్ ,క్రోమియం , కాపర్ , కాల్షియం , మెగ్నీషియం వంటివి అందవు . రుతు సంబంధ సమస్యలూ ఏర్పడవచ్చు . తరచూ మూడ్ మారిపోతుంటుంది . టెన్షన్ , డిప్రెషన్ ఎక్కువ అవుతుంది . కడుపులో ఎసిడిటీ ఏర్పడుతుంది .

నాచురల్ షుగర్ అవసరమే :

పళ్ళు , పళ్ళ రసాల నుంచి లభించే షుగర్ వల్ల హాని జరగదు . ఇంకా మనకి కావలసిన విటమిన్లు కూడా శరీరానికి అందుతాయి . క్యారెట్లు , బీట్ రూట్లు , చిలగడదుంప లాంటి వాటినుంచి నాచురల్ షుగర్ లభిస్తుంది . కావాలంటే తేనె , చెరుకురసం కూడా తీసుకోవచ్చు . అయితే తగుమాత్రంగానే  తీపిపదార్దాలు తినాలనిపిస్తే ఖర్జురాలు , యాపిల్స్ , మామిడిపళ్ళు తినవచ్చు . అడపాదడపా స్వీట్స్ తిన్నా ఫర్వాలేదు గాని రోజూ తినకండి . ఎందుకంటే తినగతినగ వేము తీపిగా మారితే షుగర్ చేదు అవుతుంది .

ఫ్యాట్ , షుగర్ శరీరానికి అవసరమే . కాని సమపాళ్లలో ఇవి ఉండాలి . అలాగే  చాక్ లెట్లని అస్సలు తినొద్దనడం లేదు కాని సమతుల్యతను పాటించాలి . పిల్లలకు పసితనం నుంచీ చాక్ లెట్లను పెట్టడం వల్ల ప్రాణాలకే ప్రమాదం అని పెద్దవాళ్ళు గుర్తించాలి . చాక్లెట్లు పట్ల ఆసక్తి , ఇష్టం అమ్మాయిల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది . ముఖ్యంగా ఫ్రీ  మెనుస్ట్రుయల్ సిండ్రోమ్ (పి ఎం ఎస్ )టైమ్ లో చాక్లెట్ బార్లు బాగా తినాలనే యావ వీరిలో ఉంటుంది . చాక్లెట్లు బాగా తినాలనిపించడానికి కారణం శరీరంలో క్రోమియం , మెగ్నిషియం లోటు . చాక్లెట్లలో మెగ్నీషియం శాతం ఎక్కువగా ఉంటుంది .
ఆడవాళ్ళకి ఋతుస్రావానికి ముందు ప్రొజెస్టెరోన్ హార్మోన్లు ఎక్కువ స్థాయిలో విడుదలవుతాయి. ప్రొజెస్టెరోన్ ఫ్యాట్ స్టోరేజ్ ని పెంచుతుంది . అందువల్ల అమ్మాయిలకి ఫ్యాటీ ఫుడ్స్ బాగా తినాలనిపిస్తుంది . చాక్లెట్లను ఎక్కువగా తింటే మైగ్రేన్ వస్తుంది . తలనొప్పి బాధిస్తుంది . లావు అవుతారు . బ్లడ్ షుగర్ తీవ్రతరం అవుతుంది . పళ్లనొప్పులు , హార్మోన్ల సమస్యలు తలెత్తుతాయి .   గుండె జబ్బులొస్తాయి . చాకోహాలిక్స్ లో మాదకద్రవ్యాల , మత్తుపానీయాల బానిసల్లో కనిపించే ప్రవర్తనా తీరు , బలహీనతలు , శారీరకరుగ్మతలు ఉంటాయి . చికిత్సలో కూడా పెద్ద తేడా ఉండదు . ఒక అధ్యయనం ప్రకారం 130 పౌండ్ల బరువున్న వ్యక్తిలో 2.5 పౌండ్ల చాక్లెట్ ని ఒక సిట్టింగ్ లో శరీరంలోకి ఎక్కిస్తే మారుజువానా ఇచ్చే మత్తు ఇస్తుందని తేలింది .

కృత్రిమ తీపి :

మధుమేహం , స్థూలకాయం లాంటి రుగ్మతలతో బాధపడేవారు తీపి పదార్దాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది . అయితే చాలామంది తియ్యని పదార్దాలకు అలవాటు పడినవారు వాటిని తినకుండా ఉండలేరు . ఇటువంటి వారికోసం పరిశోధకులు కృత్రిమ తీపినిచ్చే కొన్ని స్వీట్ నర్స్ ను సృష్టించారు . ఈ స్వీట్ నర్స్ ను తినే పదార్దాలలో కలుపుకొని తింటే తియ్యగా ఉంటాయి . కానీ అవి ఎటువంటి హానీ చెయ్యవని ఇప్పటివరకు అందరు భావిస్తున్నారు . అయితే , స్థూలకాయులు కృత్రిమ తీపినిచ్చే స్వీట్ నర్స్ ను తీసుకున్నా వారి బరువును నియంత్రించటం కష్టమైపోయిందని పరిశోధనలు తెలుపుతున్నాయి . కృత్రిమతీపిని తీసుకున్నప్పుడు మెదడు అది నిజమైన తీపిగానే భావించి మెటాబాలిజానికి గురవుతుంది . ఫలితంగా రాబోయే కేలరీలను గ్రహించటానికి మెదడు కొన్ని కణాలను విస్పోటనం చెందించి శక్తిని విడుదల చేయిస్తుంది .

అలాగే అనేక జీర్ణరసాలు కూడా ఇదే సమయంలో స్రవిస్తాయి . ఫలితంగా కడుపులో మంట (ఎసిడిటి ) తో పాటు స్థూలకాయం , యాంక్జయిటీ లాంటి అనారోగ్య లక్షణాలు కలుగుతాయని పరిశోధకులు అంటున్నారు . క్యాలరీలు లేని కృత్రిమ చక్కెర పదార్దాలు బరువు తగ్గించడంలో పెద్దగా తోడ్పడవని అమెరికా పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది . ఎలుకలపై చేపట్టిన ఈ ప్రయోగంలో కృత్రిమ చక్కెర ‘శాఖరిన్ ‘ తిన్న ఎలుకల్లో బరువు తగ్గే అవకాశాలు అంతగా కనిపించలేదని తేల్చారు . చక్కెరకు బదులుకు కృత్రిమ తీపి పదార్దాన్ని ఉపయోగించటం వల్ల బరువు తగ్గటం అంత తేలికేమి కాదని పరిశోధకులు స్పష్టం చేశారు .
తీవ్రమైన ఒత్తిడికి ఉన్న వారికి స్వీట్ల మీద మోజు విపరీతంగా పెరిగిపోతుందని వివరిస్తున్నారు . తహతహలాడిపోవటం , తరచూ తీపి ఎక్కడుందోనని వెతుక్కోవటం … చాలా సందర్భాల్లో ‘ఒత్తిడి ‘ సూచకాల వంటివి . అలాగే ఒత్తిడిలో ఉన్నవాళ్ళు అమితంగా తినే అవకాశాలు కూడా ఎక్కువే . ఎందుకంటే ఒంట్లో శక్తి నిల్వలు తగ్గి … నిస్సత్తువ , అలసట అవరిస్తున్నప్పుడు … మన శరీరం తక్షణం శక్తినిచ్చే పదార్దాల కోసం తహతహలాడుతుంది . ఫలితమే మనం తీపికోసం వెంపర్లాడటం ! అవసరాన్ని మించి అతిగా తినటం . రెండోది తీపి తింటే ఒంట్లో ఒత్తిడి సంబంధమైన ‘గ్లూకోకార్టికాయిడ్ ‘ హార్మోను ప్రభావం వెంటనే తగ్గుతుంది .
అయితే ఇలా తీపి తినాలనిపిస్తోంది కదా . అని స్వీట్లు , మిఠాయి ఎక్కువగా తినటం , తిండి ఎక్కువగా తినటం మాత్రం కోరి కోరి అనారోగ్యాన్ని కొనితెచ్చుకోవటమే అవుతుంది . ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఈ ‘తీపి తిండి ‘ మార్గం చాలా ప్రమాదకరమైంది కూడా . ఈ పరిస్థితుల్లో చెయ్యాల్సింది – తక్షణం ఒత్తిడి తగ్గించుకునేందుకు దీర్ఘశ్వాస వంటి టెక్నిక్స్ పాటించటం !దీర్ఘంగా శ్వాస తీసుకున్నప్పుడు ఒంట్లో శక్తి సమన్వయం, సర్దుబాటు జరుగుతుంది . ఒత్తిడి ప్రభావం , బడలిక భావన కూడా త్వరగా తొలగిపోతాయి .

తీపికి దూరంగా … :

పప్పుధాన్యాలు , చిక్కుళ్ళు , కూరగాయలు , తాజాపండ్లు బాగా తినాలి . సాధ్యమైనంత వరకూ శీతల పానీయాలు తాగొద్దు . చాలామంది పూరీలూ , ఇడ్లీలు , దోశలు , ఉప్మా …ఇలా ఏం తింటున్నా దానిలో పంచదార అద్దుకుని తింటుంటారు . ఈ అలవాటు మానుకోవడం మంచిది . చక్కెరతో తయారయ్యే కేకులు, పేస్త్రీలు , బేకరీ ఉత్పత్తుల్ని తగ్గించాలి . స్వీట్లను రోజూ కాకుండా ఎప్పుడన్నా మాత్రమే తినటం మంచిది . ఐస్ క్రీములకు బదులుగా తాజా పండ్లతో తయారుచేసిన డెసర్ట్స్ తీసుకోవటం మేలు .  ప్యాక్ లో నిల్వచేసిన పండ్లరసాలు కాకుండా ఇంట్లోనే ఎప్పటికప్పుడు తయారుచేసుకొని త్రాగటం మంచిది .

పండ్లను , పండ్లరసాల్ని చక్కర కలుపుకోకుండా తీసుకోవటం అలవాటు చేసుకోవాలి . ఎందుకంటే ప్రతి పండులోనూ సహజంగానే ఎంతోకొంత తియ్యదనం ఉంటుంది . నలుగురితో ఆనందాన్ని పంచుకోవటానికి … స్వీట్లనే ఆశ్రయించకుండా ప్రత్యామ్యాలు  ఆలోచించటం మంచిది . భోజనాల బల్ల మీద చక్కెర సిద్ధంగా ఉంచొద్దు . ప్రతిరోజూ వాడే చక్కెరను కొద్దికొద్దిగా తగ్గిస్తూ , తక్కువ చక్కెర వాడకాన్ని అలవాటు చేసుకోవాలి .

మరికొన్ని నష్టాలు :

చక్కెరలో పోషకాలేవి ఉండవు . కాని చక్కెర ద్వారా శక్తి క్యాలరీలు మాత్రం శరీరానికి విపరీతంగా అందుతాయి . మరోవైపు మన శరీరానికి విటమిన్లు , మినరల్స్ వంటివాటి అవసరం ఎక్కువగా ఉండడంతో ఈ చక్కెరను జీవక్రియలోకి మార్చటానికి ఒంట్లో ఒంట్లో ఉన్న కణజాలాన్ని కరిగించుకుంటుంది . దీనివల్ల శరీరం బలహీనమవుతుంది . శక్తి కోల్పోతుంది . చక్కెర రోగనిరోధక వ్యవస్థనూ అణచి పెడుతుంది . చక్కెర ఊబకాయం రావటంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది . అతి చురుకుదనం , ఆందోళనం , ఏకాగ్రత లోపం వంటి సమస్యలకు దారితీస్తుంది. ట్రైగ్లిరైడ్లనూ , కొలెస్ట్రాల్ నిల్వల్నీ పెంచుతుంది . కణజాలం సాగే గుణాన్ని కోల్పోయేలా చేసి , వాటి పనితీరును దెబ్బతీస్తుంది . చక్కెర ఎంత ఎక్కువగా తింటే కణజాలం సాగేగుణం , పనితీరు అంతగా దెబ్బతింటాయి .

Book an appointment with us. We are just a Phone call away, Let us Talk.

Phone no : +91 9989759719

0 Comments

Submit a Comment

Your email address will not be published. Required fields are marked *

Dr. Santhisree Bheesetti

Driven by her passion, she has cultivated a profound understanding of complex conditions like Autism, ADHD, Cerebral Palsy, Down Syndrome, Speech disorders, and Anxiety disorders, alongside her specialization in Women’s issues and Neurological disorders in adults.
Nose Drops to Brain Power: How Ayurveda Helps Kids with Autism

Nose Drops to Brain Power: How Ayurveda Helps Kids with Autism

We often think of the nose as just for breathing and smelling. But in Ayurveda, the nose is a powerful gateway to the brain, especially when it comes to helping kids with conditions like autism, ADHD, and speech delays. Let’s dive into how simple nose drops can make a...

Significance of Dinacharya in Maintaining Healthy Sleep Patterns

Significance of Dinacharya in Maintaining Healthy Sleep Patterns

Our bodies are designed to function according to a natural rhythm called the Circadian rhythm. This internal clock governs our sleep-wake cycle and is heavily influenced by natural cues such as Sunlight and Darkness. • Sunlight triggers signals in the brain to stay...

Nabhi Vasti: An Ancient Solution for Modern Gut Health

Nabhi Vasti: An Ancient Solution for Modern Gut Health

Nabhi Vasti is a traditional Ayurvedic treatment that focuses on the naval area, known as the Nabhi or Nabhi Marma. In Ayurveda, the naval is considered the center of the body's energy and the gateway to the digestive system. This therapeutic procedure involves the...

Ready to Restore Harmony in Your Mind, Body, and Spirit

Our Treatments

Panchakarma

Shiro Abhyanga

Nasya Karma

Takradhara

Vasti Benefits

Open chat
1
Hi!
How Can I Help You?